మన తెలుగులో ఇప్పుడు సమంతా మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంతా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. హీరోయిన్ గా కంటే కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో ఆమె ఎక్కువగా నటిస్తున్నారు. ఆమె ఇటీవల నటించిన యశోద సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కథ కాస్త బలంగా ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది అనేది ఉంది.
ప్రస్తుతం సమంతా… శాకుంతలం అనే సినిమా మీద ఫోకస్ చేసారు. ఈ సినిమా తర్వలో విడుదల అవుతున్న నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక సమంతా ఈ సినిమా షూటింగ్ లో అనారోగ్యంతో ఉన్నా సరే పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా అలాగే పాల్గొంటున్నారని తెలుస్తుంది.
సమంతా ఈ సినిమా విషయంలో కాస్త పట్టుదలగా ఉన్నారని కథలో కూడా కొన్ని మార్పులు చెప్పారని… దీనితో కథ కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఆమె మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యశోద సినిమాకు రెండు కోట్లు మాత్రమే తీసుకున్నారు సమంతా. కాని ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ డిమాండ్ చేసారని టాక్.