సినిమాలు చేసిన చేయకపోయినా వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్ శృతి హాసన్. కొంతకాలంగా సినిమాలకు దూరం పాటిస్తూ వచ్చిన శృతి ఈ ఏడాది వరుస సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతోంది. టాలీవుడ్ లో రవితేజ చేస్తోన్న క్రాక్ సినిమాలో మాస్ మహారాజాతో రొమ్యాన్స్ చేయనుంది శృతి. అలాగే ఏ ఈ బ్యూటీ తమిళ్ లో కథలను కూడా వింటుంది. స్టోరీలు నచ్చితే సినిమాలు చేసేందుకు ఆమె సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన శృతి ఆమె ప్రియుడితో విడిపోయిన తరువాత మళ్ళీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ మధ్య శృతికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు కూడా మీ తండ్రి బాటలోనే పయనిస్తారా అని ప్రశ్నించగా… తన తండ్రి కమల్ హాసన్ స్థాపించిన పార్టీకి ఎప్పుడు మద్దతుగా ఉంటానని తేల్చిచెప్పారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయం ఇప్పట్లో ఏమి చెప్పలేనని శృతి హాసన్ స్పష్టం చేశారు. కానీ ఆమె మాటలు వింటుంటే త్వరలోనే పాలిటిక్స్ లోని ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. తమిళనాట పాలిటిక్స్ లో తొలుత సినిమాలో నటించినవారు… తరువాత రాజకీయాల్లో బాగా రాణించారు కూడా.. మరి శృతి హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆమె భవితవ్యం ఎలా ఉండనుందో .