దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా తెలంగాణ చుట్టుప్రక్కల ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులు… తీవ్ర ఆందోళనలకు కారణం అవుతున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్రతో ఆనుకోని ఉన్న తెలంగాణ జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదల స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని సీఎంలతో కూడా సమావేశం అయ్యారు.
తెలంగాణలో విద్యా సంస్థలు, హాస్టళ్స్ కరోనా హాట్ స్పాట్స్ గా మారుతున్న నేపథ్యంలో… విద్యా సంస్థలను మరోసారి మూసివేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పందించారు. విద్యా సంస్థలు హాట్ స్పాట్ గా మారుతున్న నేపథ్యంలో… వీటిపై మరో మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.