తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహిత అధికారుల్లో ఒకరు సీఎస్ సోమేష్ కుమార్. ఆ సాన్నిహిత్యంతోనే జీహెచ్ఎంసీ కమిషనర్ గా, సీసీఎల్ఏగా, సీఎస్ గా అవకాశం దక్కింది. 2023వరకు సోమేష్ కుమార్ సీఎస్ గా పనిచేయనున్నారు. సీఎస్ గా ఇంతకాలం సర్వీసు చాలా అరుదుగా లభిస్తుంది.
నిజానికి సోమేష్ కుమార్ 2014 అధికారుల విభజన సమయంలో ఏపీకి కేటాయించబడ్డారు. అయితే, తాను ఏపీకి వెళ్లేది లేదని డీవోపిటీ నిర్ణయాన్ని సోమేష్ కుమార్ క్యాట్ లో సవాల్ చేశారు. దీంతో డీవోపిటీ నిర్ణయంపై స్టే రావటంతో తెలంగాణలోనే ఉంటున్నారు. ఆ కేసు అలా ఇప్పటికీ కొనసాగుతుంది.
కానీ తెలంగాణ హైకోర్టులో ఈ కేసు తెరపైకి రాబోతుంది. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు కాగా, ఒకవేళ క్యాట్ ఇచ్చిన స్టే ఆర్డర్ ను హైకోర్టు కొట్టివేస్తే… సోమేష్ ఏపీకి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. కానీ అక్కడకు వెళ్తే తెలంగాణలో లాగా అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలు లేవు.