ఇప్పుడు టాలీవుడ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ హవా ఎక్కువగా నడుస్తుంది. ఆమె దాదాపుగా అన్ని సినిమాల్లో నటిస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. యువ హీరోల సినిమాల్లో ఆమెను కీలక పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నారు ఆమె. బాలకృష్ణ కు ఆమె… హీరోయిన్ గా చేయనున్నారు.
అయితే ఇప్పుడు ఆమె విషయంలో ఒక సెంటిమెంట్ బాగా వైరల్ అవుతుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే… ఆమె నటిస్తే సినిమా హిట్ అనే భావన కంటే కూడా ఆమె పాత్ర సినిమాలో చనిపోతే సూపర్ హిట్ అనే టాక్ వినపడుతుంది. యశోద సినిమాలో ఆమె మధుబాల అనే పాత్రలో నటించారు. ఆ పాత్ర సూపర్ హిట్ అయింది. సినిమా కూడా బాగా ఆకట్టుకుంది. క్రాక్ సినిమాల్లో ఆమె జయమ్మ అనే పాత్రలో నటించారు.
ఆ పాత్ర బాగా ఆకట్టుకుంది. ఆమె కారణంగానే ఆ సినిమాను చూసారు అనే టాక్ వచ్చింది. ఆ సినిమాలో కూడా ఆమె పాత్ర చనిపోగా సినిమా సూపర్ హిట్ అయింది. రవితేజ కు వరుస ఫ్లాపుల తర్వాత హిట్ ఇచ్చింది. ఇదిలా ఉంచితే వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఆమె పాత్ర చనిపోతుంది. ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది. ఇలా వరలక్ష్మి చనిపోతే సినిమా హిట్ అనే భావన ఫాన్స్ లో వచ్చింది.