విమానం నడపడం అంటే కారు, బండి డ్రైవ్ చేసినంత ఈజీ కాదు. ప్రతీ విషయంలో కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. అలా చేయకపోతే మాత్రం కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరే గాని విమానం పైలట్ కు టేకాఫ్ లేదా ల్యాండింగ్ లలో ఏది క్లిష్టతరమైనది? అనేది ఒకసారి చూద్దాం. విమానం ను కిందకి దింపడం (ల్యాండింగ్) అన్నదే ఎపుడూ క్లిష్టమయిన ప్రక్రియగా చెప్తారు నిపుణులు.
Also Read:కావాలనే అవమానించారు..!
ల్యాండింగ్ ని పైలట్ నాలుగు దశలలో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతీ దశలోనూ నిర్దిష్ట వేగం, ఎత్తును పైలట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిర్దిష్ట వేగం కన్నా వేగం పెరిగినా, ఎత్తు పెరిగినా విమానం సరిగా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉండదు. నిర్దిష్ట వేగం కన్నా వేగం తగ్గినా ఎత్తు తగ్గినా విమానం కూలిపోయే ప్రమాదం ఎక్కువ. అందువలనే ల్యాండింగ్ అనేది క్లిష్టమయిన ప్రక్రియ.
సరైన ల్యాండింగ్ కొత్త పైలట్ కి ఎంతో శిక్షణ, ఆచరణ తర్వాతనే వస్తుందని చెప్తారు నిపుణులు. ల్యాండింగ్ సరిగా చేయకపోతే విమానం ముందు భాగం నాశనం అవుతుంది. ఇక టేకాఫ్ విషయానికి వస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. మన ప్రమేయం చాల తక్కువగా ఉంటుంది. విమాన నిర్మాణం సహజంగా ఎగురటానికి వీలుగా చేసి ఉంటుంది కాబట్టి నిర్ధిష్ట వేగం చేరగానే విమానం ఎగరటానికి సిద్ధం అయిపోతుంది.
Also Read:బ్లాక్ శారీలో బుట్టబొమ్మ.. చిరు చిలిపిచేష్టలు!