ఐపిఎల్ అనగానే మనకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపిఎల్ కోసం ఫాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఎన్ని సమస్యలు ఉన్నా సరే అనుకున్న సమయానికే నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మన హైదరాబాద్ జట్టు ఏ స్థాయిలో ఈసారి ప్రదర్శన ఇస్తుంది అనే దానిపై ఫాన్స్ అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈసారి కొందరు ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు అని అంటున్నారు.
పేరుకి హైదరాబాద్ టీం అయినా సరే హైదరాబాద్ వాళ్ళు గాని మన ఆంధ్రా వాళ్ళు గాని ఎవరూ లేరు. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది టీంలో కొందరు ప్రముఖ ఆటగాళ్ళు ఉండకపోవచ్చు.
మిచిల్ మార్ష్… ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఐపీఎల్ 2020లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇక గాయాలతో బాధపడటం కూడా జరిగింది. ఈ ఏడాది అతను టీంలో ఉండకపోవచ్చు.
జాసన్ హోల్డర్: ఈ విండీస్ ఆటగాడు మంచి ప్రదర్శనే చేస్తున్నా జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో అతను తుది జట్టులో ఉండటం కష్టంగా మారింది. డేవిడ్ వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఆల్ రౌండర్ గా విజయ్ శంకర్ కూడా జట్టులో ఉన్నాడు.
ముజీబ్ ఉర్ రెహమాన్… ఈ యువ ఆఫ్ఘన్ బౌలర్ ని పంజాబ్ రిలీజ్ చేయగా హైదరాబాద్ తక్కువ ధరకు కొనుక్కుంది. హైదరాబాద్ కి రషీద్ ఖాన్ కీ బౌలర్ కావడంతో ఇతనికి అవకాశం రాకపోవచ్చు.
మహమ్మద్ నబీ: గత సీజన్ లో ఈ ఆఫ్ఘన్ ఆటగాడు ఆకట్టుకోలేదు. స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. దీనితో అతనిని పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చు.