ఇండియాలో విక్రయించే వస్తువులకు ఎంఆర్పీ ధర అనేది చాలా కీలకంగా ఉంటుంది. మరి అమెరికాలో విక్రయించే వస్తువులకు ఎమ్మార్పీ ధర ఉంటుందా…? ఉండదు. అసలు ఎందుకు ఉండదు ఏంటీ అనేది ఒక్కసారి చూద్దాం.
అమెరికా అనేది ఏ విధంగా చూసినా సరే పూర్తి పెట్టుబడిదారి విధానాలను అనుసరించే దేశంగా ఉంది. వస్తువులను విక్రయించే వ్యక్తి అక్కడ సదరు వస్తువులకు డిమాండ్ ఆధారంగా ధరను నిర్ణయించే అధికారం అతనికి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే… పక్కపక్కన షాపుల్లో ఉన్న దుకాణాలలో పెన్ ధర భిన్నంగా ఉంటుంది. పెద్ద దుకాణాలతో పోల్చి చూస్తే చిన్న దుకాణాలకు ఎక్కువ ఖర్చులతో పాటుగా తక్కువ బేరసారాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఖరీదు ఎక్కువ.
పేరు లేని దుకాణాలు, రవాణా ఖర్చులు ఎక్కువ పెట్టె దుకాణాలు, తక్కువ డిమాండ్ ఉన్నట్లు అయితే ధరను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇక అక్కడ కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు అందరూ సిండికేట్ లా మారి ధరలు కూడా పెంచుతూ ఉంటారు. వాళ్లకు శిక్షలు ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే మనకు దీపావళి పండుగ సమయంలో మందుగుండు సామాను ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో జులై 4న టపాసులు కాలుస్తారు కాబట్టి ఆ సమయంలో ధర ఎక్కువ. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా అలెర్ట్ గా వ్యవహరిస్తుంది. సప్లై తక్కువ లేకుండా చర్యలు తీసుకుని విక్రయాలు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూస్తుంది.