డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల నుండి రక్షణ మూడు నెలల్లో తగ్గిపోతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల నేతృత్వంలోని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే సాధారణంగా ఉపయోగించే రెండు టీకాలు, కరోనావైరస్ డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా తక్కువ ప్రభావవంతంగా ఉన్నాయి.
ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా టీకా సమర్థత వరుసగా టీకాలు వేసిన 90 రోజుల తర్వాత వరుసగా 75 శాతం మరియు 61 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఇది వరుసగా 85 శాతం, 68 శాతం నుండి తగ్గింది, రెండవ డోస్ తర్వాత రెండు వారాల తర్వాత ఈ ఫలితం కనిపించిందని రాయిటర్స్ తెలిపింది. 35 సంవత్సరాల వయస్సు మరియు ఆ వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో సమర్థత క్షీణత ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కారణంగా వేయించుకునే ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొత్త ఇన్ఫెక్షన్ల నుండి రక్షణను అందిస్తాయని పరిశోధకులు సూచించారు.ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్-రివ్యూ చేయలేదు. బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS), డిపార్ట్మెంట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ (DHSC) భాగస్వామ్యంతో ఈ పరీక్షను నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) విశ్లేషణకు అనుగుణంగా ఉన్నాయి. దీనిపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి.