బాహుబలి, సాహో మూవీస్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ క్యూ కడుతుంది. ఓవైపు టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు బాలీవుడ్ దర్శక, నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ తో చర్చలు జరిపారు. ప్రభాస్ ఇప్పటికే ఓంరావత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించారు.
ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకే ప్రభాస్ కు 2023ఏడాది పూర్తయ్యేలా ఉంది. దీంతో ఇప్పటికే సినిమాలు చేస్తానని హామీ ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్న వాటి పరిస్థితి ఏంటీ అన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ప్రభాస్ కు ఇప్పటికే భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వీరికి సరైన డైరెక్టర్ దొరికితే కానీ సినిమాలు పట్టాలెక్కేలా లేదు. దీంతో ఈ సినిమాలు పూర్తయ్యేలోపు అయినా వీరికి సరైన కథతో దర్శకులు దొరుకుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.