మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ మూడు పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీలు ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిగాయి. చర్చల్లో అన్ని విషయాలపై చర్చించిన నేతలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారు. పదవుల పంపకంపై కూడా మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈరోజు మధ్యాహ్నం మూడు పార్టీల నేతలు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీనీ కలవనున్నట్టు తెలిసింది. సీఎం పదవిని శివసేనకు ఇవ్వడానికి కూడా మిగతా రెండు పార్టీలు అంగీకరించాయి. అయితే ఎంతకాలం అనే విషయాన్ని ఇంకా బయటకు వెల్లడించలేదు. డిప్యూటీ సీఎం విషయం కూడా ఏ పార్టీ నాయకులు మాట్లాడలేదు. మొత్తమ్మీద మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని మాత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. మరో వైపు శివసేన నాయకుడే 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు.