రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్ష నేత జగన్, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాణయ రెడ్డి, వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. ఈ కేసులో వైఎస్ వివేకా సతీమణి, కూతురుల తరుపున హైకోర్టు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిల తరుపున బసంత్, సల్మాన్ ఖుర్షీద్ లు వాదించారు. జగన్ తరుపున వివేక్ వాదనలు వినిపించారు.
అయితే విచారణ ప్రారంభమయ్యాక.. జగన్ తరుపు న్యాయవాది వాదిస్తూ.. గత ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో సీబీఐ విచారణ కోరామని.. ఇప్పడు ఈ కేసు విచారణ బాగానే నడుస్తునందువలన సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం సునీత తరుపు న్యాయవాది వాదిస్తూ.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కోరారని గుర్తు చేశారు. ఇప్పుడేమో సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదంటున్నారని… ఈ హత్యకేసుపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్ పట్టించుకోవడం లేదన్నారు.
8అడుగుల మేర రక్తపు మడుగులో మృతదేహం ఉన్న కూడా మంచంపై ఎలాంటి రక్తపు మరకలు కాలేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పుకొచ్చారు. వివేకా మృతదేహం వద్దకు మొదట వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారని.. ఆ తరువాత బంధువులు వచ్చారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు . ఆ సమయంలో ఎవ్వరు రాకుండా తలుపులు మూశారన్నారు. అక్కడున్న వారంతా మృతదేహాన్నికి ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి బెడ్ షీట్లో ఉంచి ఆ తరువాత ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. అక్కడ లభించిన లేఖలో వివేకా తెలుగులో సంతకం చేసి ఉందని.. కానీ ఆయన తెలుగులో సంతకం చేయరని తెలిపారు. ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలంటే..ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు.