దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అనగానే రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు,జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి బ్లాక్ బస్టర్ మూవీసే గుర్తొస్తాయి. అయితే వీళ్ళ సినీ అనుబంధం స్టార్ట్ అయ్యింది ‘మోసగాడు’ సినిమాతోనట. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ రోల్ కి చిరంజీవిని ఎంపిక చేశారు కే రాఘవేంద్రరావు.
చిరంజీవిలోని ఫైట్స్ చేసే ఎనర్జీని, డాన్సింగ్ టాలెంట్ ని తొలిసారి గుర్తించి శోభన్ బాబు తో ఫైట్స్ సీన్ అందాల తార శ్రీదేవితో డ్యాన్స్ చేసే ఛాన్స్ ని చిరంజీవికి ఇచ్చారు రాఘవేంద్రరావు.
1980లో తిరుగులేని మనిషి సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ కి బావమరిదిగా చిరంజీవిని చూపించారు రాఘవేంద్రరావు. ఐదేళ్ల తర్వాత 1985లో అడవి దొంగ సినిమాతో మొదలైన రాఘవేంద్ర రావు చిరంజీవి కాంబోలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
చిరంజీవి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలోనే మోసగాడు సినిమాలో గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు రాఘవేంద్రరావు. ఆ టైంలోనే చిరంజీవిని బాబాయ్ అని పిలిచేవారట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
చనువు పెంచుకొని మంచి నటన రాబట్టడం కోసం చిరంజీవిని బాబాయి అని ఆప్యాయంగా పిలిచేవారట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అలా చిన్న వయసులోనే బాబాయ్ గా మారిన చిరంజీవి గతాన్ని ఇటీవల గుర్తు చేసుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.