బరువు తగ్గడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేస్తే కచ్చితంగా మనం బరువు తగ్గుతాం అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అలాంటి విషయమే ఒకటి… భోజనం తర్వాత గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గడం. ఇలా చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కానీ భోజనానికి ముందే కాకుండా… ఉదయం లేచిన వెంటనే పరగడుపున ముందు గా ఒక అర లీటర్ గోరు వెచ్చని నీరు తాగాలి.
ఒక అర గంట లేదా ఒక గంట పోయేక మరో అర లీటర్ తాగాల్సి ఉంటుంది. మొదట్లో అన్ని నీళ్లు తాగలేరు కానీ నెమ్మదిగా మీకే అది అలవాటు అయిపోతుంది. ఇలా తాగడం మన జీవితంలో తప్పనిసరిగా ఒక అలవాటుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తాగడం వలన కడుపులో ఉన్న మలినాలు దాదాపుగా తొలిగి పోతాయని వైద్యులు చెప్తున్నారు. ఇలా రోజూ చేయడంతో మన పొట్టలో ఉండే కొవ్వు కాస్త తగ్గుతుంది.
కొవ్వు తగ్గితే ఆటోమేటిక్ గా కొన్ని రోజుల్లో బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగడం వలన కడుపుకి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువ. మనం తాగే నీటిలో ఏమైన క్రిములు ఉన్నా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఫ్రీ మోషన్ అవుతుంది. అదే విధంగా మలబద్దకం కూడా దాదాపుగా ఉండదు. ఇక రోజంతా యాక్టివ్ గా కూడా ఉంటాము