ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రిపూట జన సంచారం ఉండకపోవడంతో మందుబాబులు, జూదరులు, వ్యభిచారులు ఆ ఇళ్లను తమ స్థావరాలుగా వినియోగించుకుంటున్నారు.
గుత్తేదారుల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్చగా సాగిపోతున్నాయి.
ఇళ్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాలను నిర్మిస్తోంది.గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు అద్దె కొంపల్లో జీవనం గడుపుతున్నామని బోరుమంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తారనుకుంటే అధికారులు అలసత్వం వహిస్తున్నారు.