కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలు మూతపడగా… హోళీ పండుగ సందర్భంగా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్డెక్కే ప్రమాదం ఉంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే హోళీ వేడుకలపై నిషేధం విధించగా… రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
హోళీ పండుగ సందర్భంగా… హైదరాబాద్, సికింద్రాబాద్ సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైన్ షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28న సాయంత్రం నుండి 30వ తేదీ ఉదయం వరకు బార్లు, వైన్సులు, కళ్లు దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు.
ప్రజలు గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరగటంతో పాటు రంగులు చల్లుకుంటూ రోడ్లపై ఆడటం నిషేధమని… కరోనా సమయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.