మందుబాబులకు సర్కార్ షాకిచ్చింది. ఆది, సోమవారాల్లో వైన్స్ షాపులతో పాటు బార్లు బంద్ కానున్నాయి. జంట నగరాల పరిధిలో వినాయక నిమజ్జనం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
ఆదివారం ఉదయం 9గంటల నుండి సోమవారం సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్‌లు మూసివేయనున్నారు.