యూరోప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు అప్పుడే మొదలయ్యాయి. శీతాకాలం నడుస్తుండగానే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఊపందుకున్నాయి. జనవరి నెలలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దాదాపు 8 దేశాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతాకాలంలో వెదర్ వేడిగా మారడం యురోపియన్లను కలవరపెడుతోంది.
ప్రస్తుతం ఆ ఖండంలో 18 నుంచి 36 డిగ్రీల మధ్య అనేక ప్రాంతాల్లో టెంపరేచర్ రికార్డు అవుతుంది. ఫ్రాన్స్ నుంచి పశ్చిమ రష్యా వరకు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారాయి. తాజాగా న్యూఇయర్ రోజు పోలాండ్ లోని వార్సాలో 18.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగత్ర రికార్డు అయ్యింది.
అలాగే స్పెయిన్ లోని బిల్బావోలు 25.1 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది. ఈ రెండు ప్రాంతాల్లో సగటు జనవరి ఉష్ణోగ్రతల కన్నా పది డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
లుథియేనా, పోలాండ్, లత్వియా, డెన్మార్క్, బెలారస్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో జనవరి ఒకటో తేదీన అధిక టెంపరేచర్లు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్ దేశాల్లోనూ కొత్త రికార్డులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి వింటర్ సీజన్ లో చమటలు పడుతున్నాయి.