గత రెండు సంవత్సరాలలో పలు స్టాక్‌లు తమ వాటాదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇవ్వడం జరిగింది. పెన్నీ స్టాక్‌ల జాబితాకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఒకటని చెప్పాలి. ఇక ఈ స్టాక్ వచ్చేసి ఒక్కో షేరుకు రూ. 0.35 నుండి రూ.198.45కి పెరిగింది. మూడు సంవత్సరాల కాలంలో దాదాపు 567 రెట్లు పెరిగడం జరిగింది.ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ షేర్ ధరలు గత ఆరు నెలల్లో రూ. 10.37 నుండి రూ. 198.45లకు పెరిగాయి. ఈ కాలంలో దాదాపు 1,913 శాతం వరకు పెరిగడం అనేది జరిగింది.
గత సంవత్సరం డిసెంబర్ 14 వ తేదీన ఈ షేరు ధర రూ.1.62 ఉండగా 2021 డిసెంబర్ 10 నాటికి రూ.198.45లకు చేరుకుంది. దీని ద్వారా దాని వాటాదారులకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించడం అనేది జరిగింది.ఇక ఒక పెట్టుబడిదారుడు మూడు సంవత్సరాల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు 5.67 కోట్లకు చేరుకుంది.
అక్టోబర్ 28 వ తేదీ, 2021న స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.216కి, డిసెంబర్ 8వ తేదీ , 2020న 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1.53కి చేరుకోవడం జరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభంలో 17.65% పతనాన్ని నివేదించింది. ఈ స్టాక్‌లో సంవత్సరం క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ 1.22 కోట్లుగా ఉంది.