సైబరాబాద్ లో గంటల వ్యవధిలో వరుస చైన్ స్నాచింగులతో హడలెత్తించిన చైన్ స్నాచర్లను పోలీసులు గంటల్లోనే కటకటాల వెనక్కి నెట్టారు. దీంతో చైన్ స్నాచర్లు విసిరిన సవాల్ లో సైబరాబాద్ పోలీసులే విన్ అయ్యారు. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో అనూహ్యంగా పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. కాచిగూడ నుంచి ట్రైన్ లో పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ రోజు ఉదయం ఉప్పల్ నుంచి రాంగోపాల్ పేట వరకు మొత్తం ఆరు చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఉదయం 6.20 గంటల నుంచి మొదలైన స్నాచింగ్ లు 8.10 గంటలకు ముగిశాయి. ఇక చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నార్సింగి లోనే నమోదు కావడంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఉప్పల్,నాచారం,ఓయూ,రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచర్స్ రెచ్చిపోయారు. గంటలోనే ఉప్పల్, నాచారం,ఓయూ,రాంగోపాల్ పేట్ లలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు బంబేలెత్తిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తూ చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చైన్ స్నాచింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడ్డారు.
దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు ఇది సవాలుగా మారింది. ఉప్పల్,నాచారం,ఓయూ,రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఇక ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ల దొంగలు హల్ చల్ చేశారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగులు పక్కనే మరొక దొంగతనానికి పాల్పడ్డారు. ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు లాక్కొని వెళ్లారు. ఇక అన్ని సంఘటనలు చోటు చేసుకున్న ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దీంతో గంటల వ్యవధిలోనే చైన్ స్నాచర్లను పట్టుకోవడం పోలీసులకు సాధ్య పడింది. మొత్తానికి చైన్ స్నాచర్లు పోలీసుల చేతికి చిక్కడంతో హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ ప్రజలు ఇంకా పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.