- రష్యాలో కొత్త వీసా విధానం.
ప్రయాణపరంగా రష్యాలో ఇన్నాళ్లుగా ఉన్న స్వేచ్ఛకు బ్రేక్ పడింది. రష్యా, ఉక్రెయిన్ పౌరులు ఎలాంటి వీసాలు లేకుండా ఇరు దేశాలకు వెళ్లేవారు. కానీ, దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. జులై 1న ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండు దేశాల మధ్య నాలుగు నెలలుగా యుద్ధం తీవ్రతరమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ రష్యా పౌరులకు కొత్త వీసా విధానాన్ని ప్రకటించారు.
మరోవైపు తమ 27 దేశాల కూటమిలో చేరేలా దరఖాస్తు చేసుకునేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం సిఫార్సు చేసింది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినా.. ఈ అధికార ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ కూటమిలోని అన్ని దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈయూ సిఫార్సు విషయం తెలిసినప్పటికీ రష్యా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. కొత్త నిబంధనలతో ఇరు దేశాల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి మరి.