దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. మార్చి 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించారు.
అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి కొన్ని పొరపాట్లు చేశారని కొంతమంది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. విక్రమార్కుడు సినిమా లో చంబల్ లో జరిగిన సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడానికి వారి పాత్రలు అన్నీ తెలుగులో మాట్లాడే లా సెట్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో మాత్రం బ్రిటిష్ వారు ఇంగ్లీష్ లోనే మాట్లాడేలా సెట్ చేశాడు. కొంతమంది ప్రేక్షకులకు ఇది నచ్చలేదు.
ALSO READ: అఖిల్ ని ఫాలో అవుతున్న మోక్షజ్ఞ ? ఎంట్రీ కంఫర్మ్
ఆర్ఆర్ఆర్ సినిమా ఒకసారి కాదు… రెండు, మూడు సార్లు చూసిన ఆ ఇంగ్లీష్ డైలాగులు అర్థం కావు. కొన్ని దగ్గర్ల తెలుగు వాయిస్ ఓవర్ తో అడ్జెస్ట్ చేసినప్పటికీ మిగతా సీన్లలో అర్థం కాదు.
అలాగే సినిమాలో ఐదు సీన్లు హైలెట్ గా నిలిచాయని ఆ ఐదు సీన్స్ లేకపోతే మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. చరణ్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్, అలాగే జంతువులతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్, కొమరం భీమ్ వీడియో సాంగ్, క్లైమాక్స్ లో చరణ్ అల్లూరి గెటప్ ఇలా ఐదు సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయని ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని అంటున్నారు.
ALSO READ : ఆర్ఆర్ఆర్ లో మల్లి తల్లి పాత్ర ను ఎడిటింగ్ లో లేపేశారట !!
చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ పాత్రలు మినహా మిగతా పాత్రలు ఏవి కూడా అంతగా గుర్తుండిపోయే పాత్రలు కావని, ఎన్టీఆర్ పాత్రను కూడా ఇంకా డెప్త్ గా చూపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.