అతిగా ఫోన్ వాడటం వల్ల ఈరోజుల్లో యువత అనేక రోగాల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే లండన్ కు చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా అనే మహిళను సెల్ ఫోన్ ఏకంగా మంచానికే పరిమితమయ్యేలా చేసింది.
ఫెనెల్లా రోజుకు 14 గంటలకు పైగా మొబైల్ ఫోన్‌తోనే గడిపేది. దీంతో వెర్టిగో అనే వ్యాధి బారిన పడింది. 2021 నవంబర్‌లో బయటపడిన వ్యాధి తర్వాత తీవ్రమైంది. తల, మెడ నొప్పులతో పాటు నిలబడలేని పరిస్థితితో మంచానికే పరిమితం అయ్యింది.
ఈ పరిస్థితికి అతి ఫోన్ వాడకమని తెలియని ఆమె మంచంపైనా మొబైల్ వాడింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఓ రోజు ఆమె తండ్రి న్యూస్ పేపర్‌లో ఓ ఆర్డికల్ చూసి.. ఆ వ్యాధిని సైబర్ మోషన్ సిక్‌నెస్ లేదా డిజిటల్ వెర్టిగోగా గుర్తించారు.
మితిమీరి మొబైల్ వాడకం వల్ల నరాలపై ప్రభావం చూపి రక్తం, ఆక్సిజన్ ప్రవాహం తగ్గి ఈ వ్యాధి వస్తుందని తెలుసుకున్నారు. దీంతో ఫెనెల్లా తన మొబైల్ ఫోన్‌ను అటకపై పడేసింది.