ఉత్తరాఖండ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ మహిళతో పాటు ఆమె ఆమె ఆరెండ్ల కూతురిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హరిద్వార్ జిల్లా రూర్కీ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం….
ముస్లింల పవిత్ర స్థలం పిరాన్ కలియార్ కు మహిళ వెళ్లింది. అక్కడ ఆలస్యం కావడంతో రాత్రి సమయంలో తన ఆరేండ్ల కూతురితో కలిసి ఇంటికి బయలు దేరింది. మహిళను గమనించిన సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.
దీంతో ఆమె కారులో ఎక్కింది. అయితే అప్పటికే కారులో సోనుతో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు. సోనుతో పాటు అతని స్నేహితులు కారులో ఆమెతో పాటు ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని ఒక కెనాల్ లోకి విసిరేశారు.
ఉదయం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంత మంది అత్యాచారం చేశారనేదానిపై మహిళ ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతోందని పోలీసులు చెబుతున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి పేరు మాత్రం సోను అని చెబుతోందని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.