పడిపోయిన వాళ్ళకి చెయ్యివ్వడం కన్నా..నవ్వడానికే టైమ్ కేటాయిస్తుంది..ఈ ప్రపంచం. జీవితంలో చాలా సందర్భాల్లో మనమంతా ఇలాంటి సంఘటనలు చూసే ఉంటాం.మనం కూడా నవ్వుంటాం. అంతెందుకు ఆ నవ్వుకి కూడా కారణమయ్యి ఉండుంటాం. అలాంటి చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెండ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తూ ఓ మహిళ పొరపాటున కాలువలో పడిపోయింది. వాళ్ళ పెళ్ళికైనా ఇంత ఫాలోయింగ్ ఉందో లేదో తెలియదు కానీ..! కాలుజారి కాలువలో పడిపోయిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎక్కడ తీశారనేదానిపై స్పష్టత లేకున్నా ఇది దేశీ వెడ్డింగ్ కాదని తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ వధూవరుల ఫొటోలను తన ఫోన్‌లో రికార్డ్ చేస్తూ కనిపించారు. ఆపై కొద్దిసేపటికి ఆమె వెనుకగా నడుస్తూ పొరపాటున కాలువలో పడిపోయింది. అక్కడున్న వారంతా ఆమెను మురికి నీటి నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కనిపించింది.
ఇక ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. జంటను కెమెరాలో బంధించే క్రమంలో ఆమె పరిసరాలను గమనిస్తూ ఉండాల్సిందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అని ఓ ఇన్‌స్టాగ్రాం యూజర్ ఆరా తీయగా, ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని తాను ఆశిస్తున్నానని మరో యూజర్ కామెంట్ చేశారు. ఫొటోలు తీసేందుకు కొందరు ఎందుకు వెనుకాముందు చూడరని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు.