మాములుగా మద్యం తాగి మగవాళ్ళు తూగుతూ… హడావిడి చెయ్యటం ఎక్కువగా చూస్తుంటాము. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వింటే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. మద్యం మత్తులో ఓ మహిళ ప్రియుడిపై అందరి ముందే ముద్దుల వర్షం కురిపించింది. ఇంక అంతటితో ఆగకుండా ప్రియుడి నాలుకను కొరికేసింది.దీనితో ఆ యువకుడు ఆసుపత్రికి పరిగెత్తాడు. అప్పటికి మత్తు వదలకపోవటంతో మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసింది.
వివరాల్లోకి వెళ్తే పాలకొల్లులో నివాసం ఉంటున్న ఓ మహిళ భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మద్యం షాపులు ప్రారంభం అవ్వటంతో ప్రియుడుతో కలిసి మద్యం సేవించింది. ఆ మత్తు లో కాలనీలోనే బహిరంగంగానే ప్రియుడ్ని ముద్దులతో ముంచెత్తింది. మద్యం మత్తులో ఏదో అలా చేస్తుందని అంతా భావించారు. కానీ, అంతటితో ఆగకుండా ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపిస్తూనే అతడి నాలుకను ఒ కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడి ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. ఇంకా మత్తులోనే ఉన్న ఆ మహిళ మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసింది. అతడి పెదాలపై బుగ్గలపై ముద్దాడుతూ కొరకసాగింది. అతడి నాలుకను కూడా గాయపరిచింది. ఇక విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు కలిసే మద్యం సేవించారని స్థానికులు చెబుతున్నారు.