విమానంలో ఓ మహిళ చేసిన పనికి అంతా షాకయ్యారు. తన పెంపుడు పిల్లికి స్వయంగా తానే పాలిచ్చింది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఆమెను ఆపేందుకు చూశారు. అయితే ఆ మహిళ మాత్రం నిరాకరించింది.
న్యూయార్క్‌లోని సిరక్యూస్ విమానాశ్రయం నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో జరిగిందీ సంఘటన. వెంట్రుకలు లేని పెంపుడు పిల్లిని దుప్పటిలో కప్పి విమానం ఎక్కింది మహిళ. అది చూసిన సిబ్బంది శిశువులా భావించారు. అయితే తోటి ప్రయాణికులు అది శిశువు కాదు పిల్లి అని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.