కరోనా వ్యాక్సినేషన్ గుంటూరులో కలకలం రేపింది. టీకా తీసుకున్న ఓ ఆశావర్కర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి ఈ నెల 19న కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత రెండు రోజులు ఏ సమస్యా లేకుండా బాగానే ఉంది. అయితే 21వ తేదీ తెల్లవారుజామున తీవ్ర చలి జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో GGHలో చేర్పించగా.. పరిస్థితి మరింత విషమించి ఈ తెల్లవారుజామున చనిపోయింది.
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నందునే విజయ లక్ష్మి చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ తర్వాతే ఆమె మృతికి కారణాలు తెలుస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు.