మెట్రో రైల్‌లో ఓ మహిళ హల్ చల్ చేసింది. మంజూలిక వేషధారణలో ఓ మహిళ తోటి ప్రయాణికుల్ని భయపెట్టింది. తెలుగులో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి రిమేక్ అయిన బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ “భూల్ భులయ్య”.చంద్రముఖిలో జ్యోతిక చేసిన క్యారెక్టర్ని ఈ మూవీలో మంజూలిక పేరుతో విద్యాబాలన్ చేసి ప్రేక్షకుల్ని భయపెట్టింది. ఇక మంజూలికలా డ్రెస్ చేసుకున్న మహిళ మెట్రో రైల్‌లో ప్రయాణీకులను ఆటపట్టించింది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో మంజూలికగా తయారై మెట్రో కంపార్ట్‌మెంట్‌లో కలియతిరగడం కనిపిస్తుంది.అక్కడ కూర్చున్న ప్రయాణికులను భయపెట్టేందుకు ఆమె ప్రయత్నించింది.
ఆమె స్టేజ్‌పై ఇలా చేసి ఉంటే మంచి నటిగా పేరు వచ్చేదని, థియేటర్లలో డ్రామా పండించ వచ్చుకానీ..నిజ జీవితంలో కాదని ఓ యూజర్ రాసుకొచ్చారు. అసలు ఈమె సెక్యూరిటీ కండ్లు కప్పి మెట్రో రైల్‌లోకి ఎలా ఎంటరైందని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.