ఫార్టింగ్… చాలా మంది బయటకు చెప్పుకోలేని సమస్య ఇది. తెలుగులో దాని పేర్లు ఇక్కడ రాయలేం గాని… కింద నుంచి వదిలే గ్యాస్. తమకు ఈ సమస్య ఉందని చాలా మంది బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఒక మహిళ మాత్రం ఈ వీడియోలను అమ్మడం ద్వారా నెలకు 3 లక్షలు సంపాదిస్తుంది అంటే నమ్ముతారా…? ఆ మహిళ పేరు ఎమ్మా మార్టిన్.
48 ఏళ్ళ ఆ మహిళ 1999 నుంచి వీడియోలను ఆ గ్యాస్ వచ్చే సమయంలో రికార్డ్ చేస్తూ వాటిని అమ్ముతుంది. జనాలు ఆమె కంటెంట్ చూడటానికి ఆమెకు ఒక్కో వీడియోకి దాదాపు 5 డాలర్లు కడుతున్నారు. మాజీ ట్రావెల్ ఏజెంట్ ఆమె స్మెల్లీ ఈ విషయంలో కాస్త మెరుగైన పనితీరును కనబరచడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఆహారాన్ని అనుసరిస్తుంది. తాను సలాడ్ లు ఎక్కువగా తింటాను అని చెప్తుంది.
ఆస్పరాగస్ మరియు అవోకాడోస్ తింటాను అని చెప్పింది. అలాగే చాలా వరకు మెక్సికన్ ఆహారాన్ని కూడా తింటాను అని… “నాకు ఇష్టమైన వాటిలో ఒకటి కోల్‌స్లా మరియు కాల్చిన బీన్స్ కలిపి కూడా ఎక్కువ ఆహారాన్ని తింటా అని అమెరికాలోని సౌత్ కారోలీనాలో ఉండే ఎమ్మా చెప్పింది. తన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల లేనప్పుడు మాత్రమే వీడియోలను రికార్డ్ చేస్తా అని వెల్లడించింది.
ఈ విషయం తన భర్తకు తెలుసు అని, ఆయన ఎప్పుడూ దీన్ని వద్దని చెప్పలేదు అంటుంది. తన కుటుంబంలో ఈ విషయంలో ఇంకెవరికి తెలియదని… తాను పెద్ద మహిళను కాబట్టి ఇంట్లో అంగీకరించకపోవచ్చు అని చెప్పింది. ఎమ్మా తన వీడియోలను విక్రయించడానికి ఓన్లీఫాన్స్ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తుంది. ఈ వీడియోల కోసం ఆమె నిమిషానికి 7 డాలర్లు వసూలు చేస్తుంది అని సమాచారం.
తాను రోజు మూడు వీడియోలను పోస్ట్ చేస్తా అని… ఆ వీడియోలు సరిపోవడం లేదని తన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పింది. తమ భార్యల వద్ద తమ సమస్యలను చెప్పలేని ఎందరో భర్తలు తన వీడియోలను కొని చూస్తున్నారని ఆమె చెప్పడం గమనార్హం. తాను చేస్తున్న ఈ పనికి తాను ఎక్కడా ఇబ్బంది పడటం లేదని చెప్పింది ఎమ్మా.