తన భూమికి పట్టచెయ్యటం లేదంటూ ఓ మహిళా రైతు కుటుంబ సభ్యులతో సహా ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆత్మహత్యయాత్నానికి పాల్పడింది. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ సీసాలతో బాదిత రైతు ప్రమీల, కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నం చేశారు. నర్మెట్ట మండలం లోని గండిరామరం గ్రామంలో సర్వే నెంబర్లు 186/b4 లో 2- 28 గుంటలకు పట్టా చెయ్యకుండా అధికారపార్టీ నాయకులు అధికారులు బెదిరిస్తున్నారని, అధికారులు కూడా నేతలకు తలొగ్గి పట్టించుకోవడం లేదంటూ రైతు కుటుంభం సభ్యులు ఆరోపించారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.