తాళి కేవలం అలంకారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఓ మహిళ తన తాళిని ప్రాణం కన్నామిన్నగా కాపుడుకున్న సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ అగంతకుడు తన మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని దొంగిలించాలని ప్రయత్నిస్తున్నా..కత్తిపోట్లు బాధిస్తున్నా ఓ మహిళ తన భర్తతో కలిసి దొంగ చేస్తున్న ప్రయత్నాన్ని విఫల యత్నం చేసింది.
నెత్తురు చిందించి మరీ మంగళ సూత్రాన్ని కాపాడుకుంది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ కు చెందిన అశోక్,కనక లక్ష్మి హైదరాబాద్ బోరబండలో అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించేందుకు రోటేగావ్ కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో వచ్చారు.
సీతాఫల్ మండీ రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ కోసం రైలు ఆగింది. అప్పటికే రైల్లో వేచి ఉన్న అగంతకుడు కనకలక్ష్మి మెడలోని 3 తులాల బంగారు గొలుసులాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. దంపతులు వెంటనే తేరుకుని దొంగను పట్టుకుని కేకలు వేసారు.
అతడి చేతిలోని గొలుసును తీసుకునేందుకు పెనుగులాడారు. దుండగుడు కత్తితో దాడి చేసి అశోక్ ను తీవ్రంగా గాయపరిచాడు. ఆమెను గట్టిగా నెట్టడంతో కిందపడి గాయాల పాలైంది. ప్రయాణీకులు స్పందించడంతో దొంగఉడాయించాడు. సీతాఫల్ మండి రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.భార్యాభర్తలను అందరూ ప్రశంశించారు.