బెంగుళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలికి అవమానం జరిగింది. సెక్యూరిటీ చెకప్ విభాగంలో ఆమె షర్ట్ తొలగించాలని సిబ్బంది ఆమెను ఆదేశించారట.. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కేవలం ‘కేమిసోల్’ మాత్రమే ధరించి నిలబడడం ఎంతో అవమానకరమని ఆమె ట్వీట్ చేసింది.
ఒక మహిళ తన దుస్తులు విప్పాలా అని ప్రశ్నిస్తూ.. విమానాశ్రయ అధికారులను ఆమె నిలదీసింది. మానసికంగా ఇదెంత వేదనాభరితమో అధికారులు ఆలోచించాలని, తనకు జరిగిన ఇలాంటి చేదు అనుభవం మరే మహిళకూ జరగరాదని ఆమె కోరింది. తాను ఏ విమానం ఎక్కవలసిందీ తెలియజేయకున్నప్పటికీ.. ఇలా షర్ట్ తొలగించమని కోరడం దారుణమైన విషయమని పేర్కొంది.
ఆమె ట్వీట్ పై స్పందించిన అధికారులు ఇలా సోషల్ మీడియాకు ఎక్కే బదులు సిఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేయవలసి ఉండిందని అన్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన పట్ల చాలా చింతిస్తున్నామని పేర్కొన్నారు.
అపాలజీ చెబుతున్నామని, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. జరిగిన ఉదంతపై విచారణకు వారు ఆదేశించారు. తన పేరును తన ప్రొఫైల్ ని ఆమె పేర్కొన్నప్పటికీ బుధవారం వాటిని తొలగించింది. . ఆమె మ్యుజిషియన్ అని తెలిసింది.