లండన్ వైట్ పారీస్ ప్రాంతంలో ఉండే ఓ మహిళకు 20 ఏళ్ల క్రితం పొలం దున్నుతుండగా ఓ పెద్ద రాయి దొరికింది.రాయి పెద్దగా ఉన్నా బరువు చాలా తేలికగా ఉండడంతో దాన్ని ఇంటికి తెచ్చుకున్న ఆ మహిళ ! ఇంట్లో ఓ మూలకు పెట్టింది.
అలా ఇంటి మూలకు పడిఉన్న ఆ రాయిని గుర్రం ఎక్కడానికి ఎత్తుగా ఉపయోగిస్తుండేది..అలా 10 సంవత్సరాలు ఆ రాయిని అలాగే ఉపయోగించాక…ఆ రాయిపై ఉన్న దుమ్ము ధూలి అంతా కొట్టుకపోయి….ఆ రాయిపై చెక్కి ఉన్న ఓ కళాకృతి కనిపించింది. పురావస్తు శాఖకు విషయాన్ని చేరవేయడంతో….. వారు ఈ రాయిని పరిశీలించి…ఇది 2వ శతాబ్దం కాలానికి చెందినదని, ఈ కళాకృతులు గ్రీకుల ప్రత్యేకమని నిర్ధారించారు. 18 వ శతాబ్దంలో ఈ రాళ్లను బాగా డబ్బున్న వాళ్లు గ్రీక్ నుండి లండన్ కు తెచ్చుకునేవారని కూడా తెలిపారు. ఈ రాయి కూడా అలా తెచ్చుకున్నదేయని అన్నారు. ఆ రాయి ధర కనీసం 15 లక్షలు ఉంటుందని తెలిపారు.