కుక్క కోసం తల్లిపై కేసు - Tolivelugu

కుక్క కోసం తల్లిపై కేసు

పెంపుడు కుక్క కోసం కన్న తల్లిపైనే కేసు పెట్టింది ఓ కూతురు. తాను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్న కుక్కను తనకు తెలియకుండా, తాను ఇంట్లో లేని సమయంలో కుక్కను పెంచుకోవటం ఇష్టం లేని ఆమె తల్లి ఇంటి నుండి కుక్కను వదలిపెట్టింది. తీరా ఆ కూతురు ఇంటికి వచ్చి చూసే సరికి కుక్క కనపడలేదు. నేనే ఇందాకే విచిడిపెట్టానని తల్లి చెప్పటంతో ఏడ్చుకుంటూ బయటంతా వెతికి, చివరకు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ విజువల్స్‌ను చెక్ చేసింది. తన తల్లే ఆ కుక్కను బయటకు తీసుకెళ్తున్నట్లు ఆ విజువల్స్‌ లో ఉండటంతో … తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో తల్లిపై ఫిర్యాదు చేసింది.

ముంబైలోని పంత్‌నగర్‌లో తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది స్నేహ నికమ్ అనే యువతి. యువతికి కుక్కలంటే ఎంతో ఇష్టం. కానీ ఆమె తల్లికి కుక్కలంటే అస్సలు పడదు. అయితే, స్నేహ నికమ్ తన తల్లికి చెప్పకుండానే ఓ కుక్కను ఇంట్లోకి తెచ్చి పెంచటం మొదలుపెట్టింది. అది నచ్చని తల్లితో రోజు గొడవ పడేది. దీంతో.. ఈ గొడలకు ఆ కుక్కే కారణం అని భావించిన నికమ్ తల్లి, కుక్కను బయట వదలిపెట్టి ఇంటికి రావటంతో… గొడవ పెద్దదై, పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

జంతు సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తల్లిని ప్రశ్నిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp