ప్రభుత్వ పెన్షన్ కోసం ఓ దివ్వాంగురాలు పడరాని పాట్లు పడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకోసం కర్రని కావిడ చేసి భర్త,కొడుకు మోసుకు రాగా…ఆమె ముద్దల్లే ఓ పళ్ళెంలో ముడుచుకుపోయి పెన్షన్ కోసం రాసాగింది.
దివ్యాంగురాలి దీనావస్థకు చూస్తున్నవారు చలించిపోయారు. ఝార్ఖండ్లోని లతేహార్లో హృదయవిదారక ఘటన జరిగింది. గిరిజన కుటుంబానికి చెందిన ఈ దివ్యాంగురాలు బ్యాంక్కు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో కుమారుడు, భర్త సాయంతో రావాల్సి వచ్చింది.
లతేహార్ జిల్లాలోని మహుదంద్ గ్రామానికి రోడ్లు సరిగ్గా లేవు. ఈ గ్రామస్థులు పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాలంటే కాలి నడక తప్పని సరి. అయితే ఇదే గ్రామానికి చెందిన లాలో కోర్బా అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది.
దివ్యాంగురాలు ‘లాలో’ నడవలేదు. దీంతో పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు ఆమె భర్త దేవా, కుమారుడు సుందర్లాల్ కావడి కట్టి అందులో చిన్న చేసిన్ ఏర్పాటు చేసి ఆమెను కూర్చొబెట్టారు. అలా కొన్ని కిలో మీటర్లు ప్రయాణించి బ్యాంక్కు చేరుకున్నారు.
అయినా విధి మరోలా తలచింది. బ్యాంక్ సర్వర్ పనిచేయక పోవడం వల్ల లాలోకు పింఛన్ అందలేదు. దీంతో మండుటెండలో కావడిలో వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చారు ఆమె భర్త, కుమారుడు.
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దివ్యాంగులకు వారి ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని పేర్కొన్నారు.