ప్రయాణ సమయాల్లో కొందరు ఊరికే కంగారుపడుతుంటారు. సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది తప్పులు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఒక ట్రైన్‌కు బదులుగా మరో రైలు ఎక్కి.. తర్వాత తెరుకొని గాబరాగా దిగడానికి ప్రయత్నించి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.
ఉజ్జయినిలోని స్థానిక రైల్వేస్టేషన్‌లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి రైలు ఎక్కడానికి వచ్చింది. అయితే , ఆమె తొందరలో ఒక ట్రైన్‌కు బదులుగా మరోక ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత..తేరుకొంది. కానీ, అప్పటికే రైలు స్టార్ట్ అయ్యింది. ఎలాగైనా దిగేయాలనే తొందరలో ముందుగా పిల్లల్ని ఒకరి తర్వాత ఒకర్ని కిందకు తోసేసింది. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ముఖేష్ కుష్వాహా గమనించి.. వారిని రక్షించి పక్కకు తీసుకెళ్లారు.
అంతలోనే మహిళ కూడా రైలు నుంచి కిందకు దూకేసింది. అయితే, అదుపుతప్పి ఫ్లాట్‌పామ్‍కు, రైలుకు మధ్యలో పడుతుండగా… ముఖేష్ క్షణాల వ్యవధిలో స్పందించి రక్షించారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులు కానిస్టేబుల్ చూపిన సాహసానికి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
క్షణాల వ్యవధిలోనే ఈ ముగ్గురినీ కాపాడిన ముఖేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మహిళ ఎక్కిన రైలు సీహోర్‌లో ఆగదని తెలిసి ఇలా చేసిందని అధికారులు చెప్పారు.
"जल्दबाजी हो सकती है घातक"#उज्जैन– गलत ट्रैन में सवार हुई महिला,पता चलने पर जल्दबाजी में प्लेटफॉर्म पर चलती ट्रेन से उतरी, संतुलन बिगड़ने से महिला ट्रैन की चपेट में आने से बची,प्लेटफार्म पर मौजूद पुलिस कर्मी महेश कुशवाहा की सतर्कता से हादसा टला,#GRP @RailwaySeva#Ujjain #CCTV pic.twitter.com/943niH1usl
— vikas singh Chauhan (@vikassingh218) May 14, 2022
Advertisements