ఇటీవల కాలంలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా క్షణకాల ఆవేశానికి గురై నచ్చిన వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. అలా చేయడం వల్ల వారు నచ్చడమే కాకుండా వారి కుటుంబానికి కూడా ఆవేదనకు గురి చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటన అందరికీ షాక్ ఇస్తోంది. రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో ఈ రోజు పోలీసులు ఓ మహిళ, ఆమె కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే… రాజ్ కుమార్ ప్రజాపత్ అనే 28 ఏళ్ల యువకుడి మృతదేహం మంగళవారం తెల్లవారు జామున లంకా కాలనీలో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి స్నేహితుని కలుస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు రాజ్ కుమార్ కొన్ని గంటల తర్వాత వీధిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని తండ్రి మోతిలాల్ కు తెలిసింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
Advertisements
అయితే రాజ్ కుమార్ స్థానిక యువతితో సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు ఆ తండ్రి. రంగంలోకి దిగిన పోలీసులు సోనియా ఏర్వాల్ అనే యువతి తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి యువకుడిని గొంతు కోసి చంపినట్లు తెలుసుకున్నారు. వారు అబ్బాయిని చంపడానికి కారణం ఏమిటో తెలియ రాలేదు కానీ అబ్బాయి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద ఆ మహిళ, ఆమె తల్లిదండ్రులు, ఆమె అమ్మమ్మ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.