బతుకుదెరువు కోసం భౌతికంగా దేశాలు దాటిపోయినా. మనసంతా ఇక్కడే తిరుగాడుతూ ఉంటుంది. అమ్మా,నాన్న వాత్సల్యంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ ప్రేమల్లో పడిబంధీగానే ఉంటుంది.ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని వీడియో కాల్స్ చేసుకున్నా ఒక్కసారి తనివితీరా వాళ్ళని ఆలింగనం చేసుకున్న అనుభూతికి సరితూగదు. ఇలా ఎంతో మంది భారతీయులు ఉద్యోగాలకోసమో వ్యాపారాలకోసమో పొరుగు దేశాలు వెళ్తున్నారు.
టిక్కెట్స్ దొరక్కో,సెలవుదొరక్కో పండుగా పబ్బాలకు రాలేక,శుభకార్యాలకు అందుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు.తాజాగా ఓ మహిళ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. యూకే వెళ్లిన ఆమె..ఇండియాలో తన సోదరుడిని పెళ్లికి వెళ్లలేకపోతున్నందుకు చాలా బాధపడింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. కానీ, చివరకు ఆమె బాధ కాస్తా సంతోషంగా మారింది. ఆ సంతోషం కుటుంబమంతా చిగురించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన దేశానికి చెందిన ఓ మహిళ యూకేకి వెళ్లింది. ఆమె కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల ఆమె సోదరుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి తేదీ నాటికి ఆమె ఇండియాకు వద్దామని ప్లాన్ వేసుకుంది. కానీ, దురదృష్టావశాత్తు ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి.
దాంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందింది. తన సోదరుడి పెళ్లికి రాలేనేమో అని వాపోయింది. కానీ, తగ్గేదేలే అన్నట్లుగా.. చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. ఆమె టైమ్ బాగుంది…ఒక ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. నేరుగా వచ్చి సర్‌ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యింది.
ఇంకేముంది.. అనుకున్నట్లుగానే..యూకే నుంచి ఇండియాలో ల్యాండ్ అయ్యింది. నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లింది. పెళ్లిలో కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా.. ఆమె తల్లిదండ్రుల రియాక్షన్ అయితే అద్భుతం అనాలి. చాలా కాలం తరువాత కూతురిని చూడటంతో.. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. మహిళ తల్లి అయితే ఎగిరి గంతేసింది. తండ్రి కూడా ఆమెను చూసి ఆనందంతో పరవశించిపోయాడు.
చిందులేశాడు. సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఆమె రాకతో మురిసిపోయారు.ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ తల్లిదండ్రుల రియాక్షన్, సోదరుడి ప్రేమ వీడియోలో చూసి ఫిదా అయిపోతున్నారు.
కుటుంబాన్ని మించింది ఏదీ లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ‘మీరు ఎక్కడ ఉన్నా కుటుంబానికి చాలా ముఖ్యం.. ఎలాంటి పరిస్థితిలో అయినా మీరు వారికి అండగా ఉండాలి’ అంటారు.ఈ ఒక్క వీడియో చాలు అనుబంధాలను దూరం ఇంకా ధృఢం చేస్తుందని.