కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. వారి మాటే జరగాలని పిచ్చి వాదనలు, పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. దీని వలన ఎదుటివారికి వచ్చే నష్టం ఏం ఉండదు. వారే ఎక్కువ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల మన హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడని పోలీస్ ఫైన్ అడిగితే.. ఓ యువకుడు ఏకంగా బైక్ ను తగలబెట్టాడు. దీని వలన పోలీస్ కి వచ్చిన నష్టం ఏం ఉంది? వాడి బైక్ పోయింది తప్ప. ఇలాంటి విచిత్రమైన ఘటన ఒకటి అర్జెంటీనాలో చోటు చేసుకుంది.
ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంది. మాస్కులు ధరించాలి.. భౌతిక దూరం పాటించాలి.. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్టెంటీనాలో ఐస్ క్రీం పార్లర్ కు వచ్చిన ఓ మహిళను మాస్క్ పెట్టుకోవాలని సూచించిన సిబ్బందిపై ఆమె అరుస్తూ ఏకంగా అక్కడే బట్టలు విప్పి అసహనం వ్యక్తం చేసింది.
పార్లర్ లోకి వచ్చిన మహిళను మాస్క్ పెట్టుకోండి అని సిబ్బంది చెప్పారు. దీంతో, ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి.. నా మాస్క్ గురించి మీకెందుకు అంటూ వితండవాదం చేసింది. ఆమెతో డిస్కషన్ వృధా అనుకున్న సిబ్బంది.. మాస్క్ ఉంటేనే ఇక్కడ అమ్మకాలు జరుగుతాయని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, వాళ్లకు ఆ మహిళ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. తన ఒంటిపై ఉన్న బట్టలు అన్ని విప్పి.. వాటిని మాస్క్ లా పెట్టుకుంది. ఆమె చెష్టలు చూసిన వారంతా ఒక్కసారి షాక్ కి గురైయ్యారు. ఈ వ్యవహారం మొత్తం పార్లర్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Argentina Woman strips down to her underwear to use her dress as a facemask at ice cream store pic.twitter.com/bvTY6FHkn1
— OlumoRocktv (@OlumoRocktv) January 4, 2022