బీహార్ రాజధాని పాట్నాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భర్త స్నానం చేయడం లేదని, షేవింగ్ కూడా చేసుకోవడం లేదని ఓ మహిళ విడాకులను కోరింది. పైగా పళ్ళు కూడా సరిగా తోముకోడని, తను పక్కనుంటే భరించలేనంత కంపు వస్తుందంటూ… తనకు విడాకులిస్తే తన బ్రతుకు తాను బ్రతుకుతానని వాపోయింది. మొదట ఇది సిల్లీ రీజన్ అని అంత అనుకున్నారు. ఇక, మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహిళ కమిషన్ వెంటనే అతని పిలిపించింది. అప్పుడు మహిళ కమిషన్ సభ్యులకు కూడా సీన్ అర్థమైంది. అతను పక్కన నిల్చుంటే భరించలేనంత కంపు వచ్చింది. దీంతో ఆ మహిళా బాధ అప్పుడు వారికీ కూడా అర్థమైంది. వెంటనే అతన్ని హెచ్చరించారు. రెండు నెలల్లో తీరు మార్చుకోవాలని… షేవింగ్ చేసుకోవాలని, డైలీ స్నానం చేయాలనీ , పళ్ళు శుభ్రంగా తోముకోవాలని ఆదేశించారు. లేదంటే విడాకులు ఇస్తుందని హెచ్చరించారు. ఇందుకు అతను అంగీకరించాడు.
2017లో అతన్ని పెళ్లి చేసుకుందామె. ఇక అప్పట్నుంచి అతడి అపరిశుభ్రతతో ఆమె నరకం అనుభవిస్తుంది . చుట్టూ దోమలు వాలుతున్నా, ఈగలు ముసురుతున్నా అతడు మాత్రం మారలేదు. దీంతో ఆమె అతని బాధను భరించలేక విడాకులకు అప్లై చేసుకుంది.