ప్రేమించు అంటుంది..! పెళ్ళిచేసుకుందాం అంటుంది..! ఓకే చెప్పగానే భార్యగా మారిపోతుంది.కొన్నిరోజులు ఎన్నెన్నో జన్మలబంధం అంటుంది. అదును చూసి డబ్బు నగలతో ఉడాయిస్తుంది.ఇదీ చెన్నైలోని అభినయ అనే ఓ కిలాడీ లేడి క్రైమ్ స్టోరి.!
విలాసాలకోసం వివాహాన్ని బిజినెస్ టూల్స్ లా వాడుకుంటూ ఇప్పటికి నలుగుర్నిముంచేసింది.తాంబరం ప్రాంతానికి చెందిన బాధిత భర్త నటరాజన్ పోలీసులకి చ్చిన ఫిర్యాదుతో ఈ అభినయ చేసిన అభినయమంతా బైటపడింది.
తమిళనాడులోని తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ ముడిచ్చూరు రహదారిలోని బేకరీలో పనిచేస్తున్న అభినయతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.వయసులో అభినయం నటరాజన్ కన్నా మూడేళ్ళుపెద్దదైనా కొడుకు ముచ్చటకాదనలేని నటరాజన్ తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకున్నారు.
అలా ఆగస్టు 29న నటరాజన్ అభినయల పెళ్ళిజరిగింది. పెళ్ళైన నెలరోజుల తర్వాత ఇంట్లోఉన్న నగలు నగదుతో పరారయ్యింది. నటరాజన్ వెతకటం మొదలు పెట్టాడు. ఎక్కడా జాడజవాబూ లేదు. తను తరుచూ చేసేరెండు ఫోన్ నంబర్లకీ కాల్ చేసాడు.అభినయ అప్పటికే స్విచ్చాఫ్ చేసింది.
చివరకు నటరాజన్ తాంబరం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సెమ్మంజేరిలో దాక్కున్న అభినయను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోనికి తీసుకున్నారు. విచారించిన పోలీసులకు ఆమె చీటింగ్ స్టోరీసన్నీ ఒక్కొక్కటిగా బైటపడ్డాయి. తొలుత మన్నారుకు చెందిన యువకుడిని పెళ్ళాడి పదిరోజులకు పెట్టేబేడా సర్దేసి డబ్బు నగలతో జారుకుంది.
తర్వాత మదురైకి చెందిన శెంథిల్ కుమార్ ని పెళ్ళాడింది.యేడాది కాపురం చేసి విడిచిపెట్టేసింది.వారివురికీ ఓమగబిడ్డపుట్టాడు.తర్వాత శెంథిల్ కి టాటా చెప్పేసింది.ప్రస్తుతం ఆబాబుకి 8యేళ్ళు.శెంథిల్ తో విడిపోగానే కేళంబాక్కంకి చెందిన యువకుడితో జట్టుకట్టింది. ఎప్పట్లాగే నగలు నగదుతో తుర్రుమంది. చివరిగా నటరాజన్ని చేసుకుని పోలీసుల చేతికి చిక్కింది.
పోలీసుల విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు బైటకొచ్చాయి. మూడు,నాలుగు పెళ్ళిళ్ళకు ఆమెకు సహాయపడిన రెండో భర్తశెంథిల్ని అదుపులోనికి తీసుకున్నారు.కాగా బాధితుడు నటరాజన్ దగ్గర దోచుకున్న డబ్బుతో శెంథిల్ తో విలాసంగా గడిపడానికి ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది.అభినయ ఉపయోగించే 32 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.