ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ ఇద్దర్ని చావబాదారు బాధితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిందీ ఘటన. ఉద్యోగాలు ఇప్పిస్తానని 91 మంది దగ్గర రూ.1.9 కోట్లు తీసుకున్నారు పాల్వంచకు చెందిన మేఘన సరస్వతి, బూర్గంపాడు మండలం పినపాకపట్టి నగర్ కు చెందిన రాంబాబు. ఎన్నాళ్లయినా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో ఇద్దర్నీ కొట్టారు బాధితులు.
పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు మేఘన, రాంబాబు. వీరిద్దరిపై 2019లో ములకలపల్లి పోలీస్ స్టేషన్ లోకేసు నమోదైంది.