వరంగల్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. మహిళా కానిస్టేబుల్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌనిక అనే మహిళా కానిస్టేబుల్ మహబూబాబాద్‌లో రైటర్‌గా పనిచేస్తుంది.
మౌనిక వరంగల్‌లోని తన నివాసంలో గత రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే మౌనిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే మౌనిక ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు. మౌనిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకనున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మౌనిక మృతదేహాన్ని పరిశీలించారు. బంధువుల ఫిర్యాదుతో మట్టవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.