ఆంధ్రప్రదేశ్ లో లో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పరిరక్షణ సమితికి కొందరు విరాళాలు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు రాజధాని గా అమరావతినే కొనసాగించాలంటూ విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలియాజేస్తూ చంద్రబాబు దీక్ష శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బంగారు గాజులను విరాళంగా చంద్రబాబుకు అందించింది.
అనంతరం మరికొంత మంది నేతలు, రైతులు విరాళాలు ఇచ్చారు. ఈ సందరభంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎంతో మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలిస్తామని చెప్పి రైతుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శయించారు.