దేశ రాజకీయాల్లో కొందరు మహిళా నేతలు తమదైన రీతిలో చెరగని ముద్ర వేశారు. ఎన్నికల్లో విజయాలు, పాలనలో సంస్కరణలు, ఉన్నత పదవులతో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రాన్ని శాసించి రాజకీయాల్లో తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
అదే సమయంలో కొందరు మహిళా మొదట్లో గొప్ప పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత కుంభకోణాల్లో ఇరుక్కుని విమర్శల పాలయ్యారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అవినీతి, కుంభకోణం కేసుల్లో చిక్కుకున్న మహిళా నేతల గురించి మరోసారి హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
ఈ జాబితాలో మొదట వినిపించే పేరు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత. ఆమె తన నెచ్చెలి శశికళతో కలిసి అక్రమంగా ఆస్తులు కూడ బెట్టారంటూ కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ కూడా జైలుకు వెళ్లారు.
ఆ తర్వాత ఆ జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు మాజీ సీఎం, లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీ దేవీ. భూమి కోసం రైల్వే ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. సైనికులకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ మాజీ రాష్ట్రపతిపై ఆరోపణలు ఉన్నాయి.
డెక్కన్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కూడా విద్యార్హతల విషయంలో వివాదం మొదలైంది. ఈ జాబితాలో ఇంకా ఢిల్లీ మాజీ సీఎం, షీలా దీక్షిత్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం వసుంధరారాజే, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, సుష్మాస్వరాజ్, మేనేకాగాంధీ, శారదా స్కాంలో మమతాబెనర్జీలు, డీఎంకే కనిమొళి ఉన్నారు.