ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా వివాదంలో ఇరుక్కున్నారు. మహిళలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
ముంబైలోని థానేలో పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మాట జారారు.
మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలోనూ అంతే బాగా అందంగా కనిపిస్తారని చెప్పారు. తన కండ్లకు అయితే వాళ్లు ఏ దుస్తులు ధరించకున్నా బాగుంటారని ఆయన అన్నారు.
యోగా తరగతులకు వస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాం దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉన్నారు.