తెలుగు సినిమా హీరోల్లో కోతి మొహాలు?

శ్రీరెడ్డి, మాధవీలతతో మొదలైన పోరాటం అంతకంతకూ కొనసాగుతోంది. అప్పుడు తెరవెనక మురుగునంతా ప్రపంచానికి చూపిస్తామంటూ ముందుకొస్తున్నారు దగాపడ్డ ఫిమేల్ ఆర్టిస్టులు. అపూర్వ, సునితారెడ్డి, సంధ్యానాయుడు, శ్రీవాణి, శిరీష, ఝాన్సీ, నాగలక్ష్మీ ఒక్కరొక్కరుగా బైటికొచ్చి ఇలా ఇండస్ట్రీలో అంతర్గతంగా సాగుతున్న తతంగాన్ని కడిగిపారేశారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఒక చర్చాగోష్టిలో పలువురు జూనియర్ ఆర్టిస్టులు కడుపు చించుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరెవరు ఏమన్నారంటే..


  • సినిమా రంగంలో మగాళ్ల రూపంలో మానవమృగాలు, తెరవెనుక జరుగుతున్న లీలలను చూస్తుంటే అక్కడి మహిళల ఆత్మ ఎంత క్షోభిస్తుందో అర్ధమవుతోంది- ఐద్వానాయకురాలు సత్యవతి
  • లైంగిక దాడి జరిగితే కానీ అవకాశాలు రావు, కో-ఆర్డినేటర్ల నుంచి తాతల వరకు అందరూ సొంగగార్చుకునే వాళ్ళే, లొంగిపోయినా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు-
  • పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టకుండా స్టూడియోల చుట్టూ తిరిగితే న్యాయం జరగదన్న స్టేట్మెంట్ ఆయన అజ్ఞానానికి నిదర్శనం – శ్రీరెడ్డి
  • పవన్ కళ్యాణ్ కు మసాజ్ చేసుకునేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి, వారి సమస్యల గురించి మాత్రం పట్టించుకోరు- క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి
  • 30 సర్జరీలు చేయించుకుంటే తప్ప హీరోలు కాలేని మొహాలు ఇండస్ట్రీలో ఉన్నాయి – సునితారెడ్డి
  • సినిమారంగంలో ఉండే మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, సంఘటితమవుతున్న ఆర్టిస్టుల మధ్య చిచ్చుపెట్టే అవకాశాలున్నాయి – మహిళా సంఘం నాయకురాలు దేవి
  • సినీరంగంలో లైంగిక, మానసిక దోపిడి ఎంత తీవ్రంగా ఉందో బాధితులను చూస్తే అర్ధమవుతోంది, సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయాలపై అధ్యయన కమిటీ వేయాలి – మహిళా సంఘం నాయకురాలు సంధ్య