ఉక్రెయిన్, రష్యా మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎలాగైనా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సైనిక చర్యకు దిగారు. అయితే.. రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయన్ బలగాలు వీరోచితంగా పోరాడుతున్నాయి.
అంతేకాకుండా ఉక్రెయిన్ సైన్యంలో అనేక మంది పౌరులు చేరారు. అందులో మహిళలు కూడా భారీగానే చేరడం విశేషం. మరోవైపు అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తమవారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ లో భారత ప్రభుత్వానికి ఉక్రెయన్ కు చెందిన పైలట్లు తమవంతు సహకారం అందిస్తున్నారు.
Advertisements
ఇందులో ఒకరు మహాశ్వేత చక్రవర్తి. 24 సంవత్సరాల మహాశ్వేత అపార ధైర్యసాహసాలను కనబరిచి భారతీయులను కాపాడింది. పోలాండ్-హంగేరీ సరిహద్దు నుంచి 800 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. అందుకు భారత ప్రభుత్వం ఆమెను అభినందించింది.