మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ 2023 ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ భామా మణులైన కియారా అద్వాణీ, కృతి సనన్ తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించగా.. ప్రముఖ రాప్ సింగర్ ఏపి దిల్లాన్ తన పాటతో ఓలలాడించాడు.
ముందుగా కియారా అడ్వాణీ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కు చిందేసి అభిమానులను ఫిదా చేయగా.. అనంతరం కృతిసనన్‌తో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ప్రదర్శించారు.
బిజిలీ పాటతో కియారా తన డ్యాన్స్‌ను ముగించగా.. చక్‌దే ఇండియా అంటూ జెండా ఊపుతూ కృతి సనన్ స్టేజ్‌పైకి వచ్చింది. పరమ్ సుందరీ సాంగ్‌తో ఆమె డ్యాన్స్ ముగియగా.. దిల్లాన్ తన స్టైల్లో స్లేజీపైకి వచ్చాడు. చివర్లో దిల్లాన్ కియారా , కృతి సనన్‌తో కలిసి చిందేశాడు.